రొటీన్ చెత్త సినిమాలతో విసిగి, వరల్డ్ సినిమా గురించి తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నారా?
మీకు అభినంధనలు.
విదేశీ చిత్రాలలో కూడా చాలా చెత్తవి ఉంటాయని, ఏదేశంలో అయినా చెత్త ఎక్కువని త్వరగానే గ్రహిస్తారు. చెత్త సినిమాలు చూసి చూసి,ఆ రుచికి అలవాటైన ప్రాణం ఏదేశపు చిత్రమైన ఆ చెత్త కోసమే వెదుకుతుంది.
కొంచెం ఓపిక చేసుకుని వెదికితే మంచి చిత్రాలు భారతదేశంలోనూ కనిపిస్తాయి. విదేశాల్లోనూ కనిపిస్తాయి.
వరల్డ్ సినిమాలలో నేను చూసిన వాటిల్లో నాకు మంచివి అనిపించినవి మీకు పరిచయం చేసే ముందు, మీతో కొన్ని ఆలోచనలు పంచుకోవాలనుకుంటున్నాను.
ఈ సినిమాలు ఎవరికోసం కాదు?
కాలక్షేపమే జీవిత పరమార్ధంగా భావిస్తూ, ఎలాంటి చాయిస్ లేనట్టుగా, విధిగా ఏదో ఒక సినిమా చూడడం ఒక వ్యసనం. సినిమా అనేది కేవలం టైంపాస్ కోసమేనని ఇప్పటికే మీరు నమ్ముతూ ఉంటే,ఈ సినిమాలు మిమ్మల్ని నిరాశపర్చవచ్చు.
ఈ సినిమాలు ఎవరికోసం?
సినిమా అనేది గొప్ప కళని,మన ఆలోచనలను,అభివృద్ధిని ప్రభావితం చేస్తుందని నమ్ముతూ, మంచి సినిమాల గురించి తెలుసుకోవడం,మంచి సినిమాలు చూడడం అనేది ఒక ఆరోగ్యకరమైన ఎదుగుదలగా భావించేవారికోసం.
ఇంతకీ మంచి సినిమా అంటే ఏమిటి?
మంచి సినిమాకి చాలా నిర్వచనాలు ఉన్నాయి. నా దృస్టిలో మంచి సినిమా అంటే:
1. ఆలోచింపచేసేది
2. అనుభూతిని కలిగించేది
3. జీవితం పట్ల సమాజం పట్ల అవగాహన కలిగించేది, ప్రేమని పెంచేది
4. మనలో మానవత్వాన్ని పరిమళింపచేసేది.
Tuesday, January 15, 2008
Subscribe to:
Post Comments (Atom)
1 comment:
good work....
Post a Comment